మెలుకవలు పాటించి మామిడి పూతను కాపాడుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి దశరథ రామిరెడ్డి తెలిపారు. మంగళవారం చంద్రగిరి మండలం, ఐతేపల్లి గ్రామంలోని మామిడి తోటలను తిరుపతి జిల్లా ఉద్యాన అధికారి బి. దశరధ రామిరెడ్డి,
చీని, నిమ్మ పరిశోధన స్థానము, పేరూరు, తిరుపతి, ప్రధాన శాస్త్రవేత్త ఆర్ నాగరాజు పరిశీలించారు. మామిడిలో పూతకు ప్రధానకారణాలు సరైన పద్దతిలో ఎరువులు, రాత్రి, పగటి ఉష్ణోగ్రతల మధ్య తేడా అని తెలిపారు.