ఏళ్ల తరబడి పురపాలక సంఘానికి చెల్లింపు చేయాల్సిన మొండి బకాయిదారుల విషయంలో పురపాలక సంఘ అధికారులు ఝలక్ ఇస్తున్నారు.
తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూరుపేటలో దాదాపు ఏళ్ల తరబడి బకాయి ఉన్న పురాతన భవనాన్ని మంగళవారం జప్తు చేశారు. అక్కడి భవనం పురపాలక సంఘానికి చెందిందంటూ సూచికలు ఏర్పాటు చేశారు. కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలు చెల్లించాలని తెలిపారు.