నాగలాపురం ఎస్. ఐ ఓబయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ నేటి నుండి విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి. కుటుంబంతో బయట ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విలువైన వస్తువులను ప్రజలు బ్యాంకుల్లో భద్రపరుచు కోవాలని విజ్ఞప్తి చేశారు.