ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌సయ్యిద్ (73) ప్రస్తుతం పాకిస్థాన్ కస్టడీలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అతడికి పాక్‌లో 78 ఏళ్ల జైలుశిక్ష పడిందని, టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో ఆ శిక్షను అనుభవిస్తున్నట్లు యూఎన్ తెలిపింది.
హఫీజ్‌సయ్యిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2008లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. 2020, ఫిబ్రవరి 12 నుంచి అతడు శిక్ష అనుభవిస్తున్నట్లు యూఎన్ పేర్కొంది.