ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది.
దాడుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలుపాలని ఆదేశించింది. ఈనెల 5న టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ బృందంపై ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు.