ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సమన్లు జారీచేసింది. NCPCR చీఫ్ ప్రియాంక్ కనూంగే
ఈ మేరకు భారత్‌లోని యూట్యూట్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరాచాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. అటువంటి ఛానెళ్ల జాబితాతో ఈనెల 15న తమ ముందు హాజరుకావాలని తెలిపింది.