సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కాచిగూడ-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్,
నాందేడ్-కాకినాడ స్టేషన్ల మధ్య గురువారం నుంచి ఈ నెల 16 వరకు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లలో 30 నుంచి 50 శాతం వరకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.