సంక్రాంతిని మూడు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు భోగి మంటలు వేస్తారు. నవధాన్యాలు, రేగిపండ్లతో స్నానాలు చేస్తారు. నువ్వులు, పెసళ్లు కలిపిన పులగం తింటారు. సంక్రాంతి నాడు దేవునికి నైవేద్యం పెడతారు.
సోదరీమణుల దీవెనలు, గారెల వంటకాలు సరేసరి. కనుమ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. హడావుడి జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు ఆదరణ కోల్పోతున్నాయి.