ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తెలిపింది. ఆయా దేశాల నుంచి 194 దేశాలకు వెళ్లేందుకు ఫ్రీ వీసా సౌకర్యం ఉంది.
గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్‌లు మొదటి స్థానంలో ఉన్నాయి. ఫిన్లాండ్, స్వీడన్‌లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది.