చిట్వేలి లోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయనున్న శాంతి రథం కొరకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ ఉపాధ్యక్షులు ఆకేపాటి వెంకటరెడ్డి ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గురువారం మానవత అధ్యక్షులు సాయి మాట్లాడుతూ చిట్వేలి శివాలయంలో జరిగిన సమావేశంలో వెంకటరెడ్డి ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు తెలిపారు. మానవత ఆధ్వర్యంలో శాంతి రధాన్ని మండల ప్రజలకు ఉచితంగా పంపిస్తామని సాయి అన్నారు.