భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని మోదీ జనవరి 12న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వంతెనపై రాకపోకలకు అధికారులు పలు ఆంక్షలు విధించారు.
వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లు దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మినీబస్సులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.