ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు.
అయితే ఇక్కడో వింత ఆచారం కొనసాగుతోంది. వేడుకల వేళ కొండపైన దొరికిన తేళ్లను పట్టుకుని స్వామికి నైవేద్యం పెడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఏటా ఇలానే ఉత్సవాలు నిర్వహిస్తారు. వింతగా అనిపించినా ఎప్పటి నుంచే ఈ ఆచారం కొనసాగుతోంది.