దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు జరుపుతోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. హర్యానాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఈ క్రమంలో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో సోనిపట్ జిల్లాలోని షార్ప్ షూటర్లు అయిన అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు.