కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, అధిర్రంజన్ చౌధురీలు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం దురదృష్టకరమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందు నుంచే కాంగ్రెస్ ఆటంకాలు సృష్టించిందని, ఇప్పుడు 'ప్రాణప్రతిష్ఠ' వేడుకనూ అవమానిస్తోందని ఆరోపించారు. ఒక విధంగా ఇది దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, అందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.