సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు భారీగా నష్టపోయారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. జులైలో పట్టిసీమ పంపులు వదిలుంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేదికాదని విమర్శించారు.
ఆర్బీకేలు దళారీ కేంద్రాలుగా మారాయని, ధాన్యం రైతుల వద్ద దోచుకున్న సొమ్ములో తాడేపల్లికి వాటాలున్నాయని ఆరోపించారు. రైతుల బాధలు వినే తీరిక మంత్రులు, ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందని మండిపడ్డారు.