కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై సూచనలు కోరిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి ఆమె లేఖ రాశారు.
ఇది దేశ రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించే, ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వాన్ని అనుమతించే వ్యవస్థని ఆరోపించారు. ‘‘నేను నిరంకుశత్వానికి వ్యతిరేకం. మీ ఆలోచనకు కూడా’’అని చెప్పారు.