ఈ నెల 22న అయోధ్యకు 100 చార్టెట్ విమానాల్లో అతిథులు హాజరవుతారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్యలో ఈనెల 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది.
అహ్మదాబాద్- అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు. డిసెంబర్ 30న అయోధ్యలో మహర్షి వాల్మికీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.