ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. 'చంద్రబాబు అధికారం కోసం ఎన్నో వేషాలు వేశాడు.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు ఆయనే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ పోవటానికి చంద్రబాబు కారణం కాదా? హోదా వద్దు ప్యాకేజీ చాలు అని ఎందుకు అన్నారు? ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించుకోలేక పోయారు.' అని మండిపడ్డారు.