కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో పేరెంట్స్ స్కానింగ్ చేయించారు. అందులో బాలిక గర్భంతో ఉన్నట్లు తేలడంతో వైద్యులు షాక్ అయ్యారు. 8 నెలల గర్భంతో ఉన్న బాలికకు పరీక్షల అనంతరం డాక్టర్లు డెలివరీ చేశారు. ఈ ఘటన జనవరి 9న జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.