చిత్తూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా పుంగనూరు పట్టణానికి చెందిన రషీదా శుక్రవారం నియమితులయ్యారు. ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని కార్యాలయంలో నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలపై విస్తృత ప్రచారం చేయాలని రషీదాకు సూచించారు.