ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు అప్పగించొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. అక్కడ నిరాదరణకు గురైన షర్మిల ఇక్కడెలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన వ్యక్తికి ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తే జరిగే పరిణామాలను తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ను నడిపించే నాయకులు లేరా అని ప్రశ్నించారు.