రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని జెలెన్స్కీ తెలిపారు.
కాల్పుల విరమణను ప్రకటిస్తే రష్యాకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. రష్యా తన ఆయుధాలను మరింత పెంచుకుంటుందని, ఆ తర్వాత తమను అణచివేస్తుందని అన్నారు. ఈ మేరకు ఎస్టోనియా పర్యటనలో బాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.