విశాఖ జిల్లా పరిషత్ రెండవ స్థాయి సమావేశంలో గొలుగొండ మండలం జడ్పిటిసి గిరిబాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులను రైతులకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. హౌసింగ్ శాఖ సంబంధించి గ్రామీణ పథకం కింద ఇచ్చిన ఇళ్లు నిర్మాణానికి సంబంధించి పెండింగ్ బిల్స్ పేమెంట్స్ పూర్తి చేయాలని పేర్కొన్నారు.