నగరంలోని రైల్వేస్టేషన్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. రూఫ్‌టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించగా. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి.
తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తికి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలుపైకి దూకాడు. ఎట్టకేలకు పోలీసులు ప్రయాణికుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa