ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను ఎవరినీ కొట్టలేను తిట్టలేను అందుకే అధిష్టానం ఆలోచనకు సరిపోయి ఉండకపోవచ్చని అన్నారు. అలాగని పార్టీని తృప్తి పరచడానికి ప్రతిపక్షాన్ని తిట్టలేనని స్పష్టం చేశారు. మంత్రి పదవికి నాకు అర్హత ఉందన్నారు. సర్వేలో జోగి రమేష్ పనితీరు బాగుందేమో అందుకే టికెట్ ఇచ్చి ఉంటారని అన్నారు.