కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు సామాన్యప్రజలకు అందాలనే ధ్యేయంతో భారత్ వికాస్ సంకల్ప యాత్రను చేపట్టామని నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరు పరిధి నంగనూరు పల్లె గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రను బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఉజ్వల్ పథకం కింద మహిళలకు ఉచితగ్యాస్ సిలిండర్లను పంపిణీచేశారు. సుబ్రహ్మణ్యం, జయలక్ష్మి, రామచంద్రుడు, కంభగిరి పాల్గొన్నారు.