మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దత్తిరాజేరు మండలంలోని గడసాం గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గడసాం గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు (47) కు చెందిన పొలంలో మోటార్ కి సంబంధించిన పరికరాలు గురయ్యాయని, దీనిపై మూడు రోజుల కిందట పెదమానాపురం పోలీసులకు ఫిర్యాదు చేసారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.