కొమరాడ మండలం పంతులవలస గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. దాంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు. ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని ఎవరు ఏనుగుల వద్దకు వెళ్ళవద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులు కోరారు. రాత్రి సమయంలో బయటికి రాకూడదని పొలాలకు వెళ్లేటప్పుడు చూసుకొని వెళ్లాలని తెలిపారు.