పిచ్చికుక్క వీరంగం సృష్టించడంతో రిహాన(4) అనే బాలుడి తలకు తీవ్ర రక్తగాయా లైన సంఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూ సింది. వివరాల్లోకి వెళ్ళితే.... గుర్రంకొండ పట్టణంలోని తాళంవీధికి చెందిన రౌనక్ కుమారుడు రిహాన ఇంటి ముందర ఆడుకొంటుండగా పిచ్చికుక్క రెండు రోజుల క్రితం దాడి చేసింది. ఈ క్రమంలో బాలుడి తలపై ఇష్టానుసారం గా కరించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడ్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రిహాన పరిస్థితి ఆందోళనకరంగా ఉంద ని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 20 రోజుల క్రితం గ్రామంలో వీధి కుక్కల దాడిలో సుమారు 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ సంఘటన మరువక ముందే బాలునిపై పిచ్చికుక్క దాడి చేయ డంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందిం చి తగు చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.