రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే... అది రాచరికానికి దారి తీస్తుందని.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం నాడు జై భారత్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19వ తేదీన ప్రారంభించడం మంచిదన్నారు. ‘నా విగ్రహాలు కన్నా...నా పుస్తకాల ద్వారా నన్ను గుర్తించండి’ అని అంబేద్కర్ చెప్పారన్నారు. రాజ్యాంగం మంచిదే అయినా.. అధికారంలో ఉన్నా పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే అది వృథానే అవుతుందన్నారు. ప్రజలు కూడా రాజ్యాంగాన్ని మంచిగా అమలు చేసే వారినే ఎన్నికల్లో ఎన్నుకోవాలన్నారు. ఏపీలో బీజేపీని ఎప్పుడో ఓడించారని.. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్రజాభిప్రాయానికి భిన్నంగా బీజేపీతో అంట కాగుతున్నాయని మండిపడ్డారు.