వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చాగలమర్రి మండలంలోని తోడెండ్లపల్లె గ్రామంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.... వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని అన్నారు. టీడీపీ పార్టీని నమ్మి వచ్చిన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చాగలమర్రి మండలంలోని తోడెండ్లపల్లె గ్రామంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఉపసర్పంచ్ శ్రీనివాసులు, నరహరి, హరిశ్చంద్ర, చెంచురాజు, రమణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమా జగత్ విఖ్యాతరెడ్డి, భార్గవ్‌రామ్ నాయుడు, నరసింహారెడ్డి, అన్సర్‌బాషా, సల్లా నాగరాజు, గుత్తి నరసింహులు, కొలిమి ఉసేన్‌వలి, కొలిమి షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.