రాజమండ్రి సీఐడీ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న ఎం.కృష్ణమూర్తినాయుడు పదోన్నతిపై విజయవాడ క్రైం ఏడీసీపీగా బదిలీపై వచ్చారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీక రించారు. సీపీ కాంతి రాణాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. నగరంలో క్రైం రేటు తగ్గించేందుకు అందు బాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. పాత నేరస్థుల కదలికలపై డేగకన్ను వేసి ఉంచాలని, నగరంలో సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించరాదని సూచించారు.