కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఒకేసారి డబుల్ గుడ్‌న్యూస్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ కూడా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందుతోంది. కేంద్రం డీఏను 4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో డీఏ 50 శాతానికి చేరనుందని సమాచారం.