సంక్రాంతి పండగను పురస్కరించుకుని కనిగిరి సర్కిల్ పరిధిలో ఎక్కడైనా కోడి పందేలు, పేకాటలు నిర్వహిస్తేచట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కోడి పందేలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి అనుమతుల్లేవని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేదిలేదని కేసులు నమోదు చేస్తామని చెప్పారు.