మద్దిపాడు పట్టణంలో సర్వీస్ రోడ్డులో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి అద్దంకి వైపు సర్వీస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా, అదే మార్గంలో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఆర్టీసీ బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఒంగోలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa