ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో శనివారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 22(180ఎం. ఎల్) మద్యం బాటిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేష్ వెల్లడించారు. అక్రమంగా మద్యం అమ్మటం చట్టరీత్యా నేరమని ఎస్ఐ మహేష్ అన్నారు.