గిద్దలూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న నిరసన దీక్షలకు శనివారం జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు తమకు నెలకు 26 వేల రూపాయలు జీతం ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాెంటిటీ చెల్లించాలని అంగన్వాడి కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.