ప్రతిపక్ష ఇండియా కూటమిని ముందుండి నడిపే అంశంపై సందిగ్దతకు తెరపడింది. కూటమి ఛైర్మన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎంపిక చేశారు. కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరున ప్రతిపాదించినప్పటికీ ఆయనకు తిరస్కరించారు. వాస్తవానికి ఛైర్మన్‌గా నితీశ్ పేరును చాలా మంది ప్రతిపాదించారు. కానీ...ఆ పదవి కాంగ్రెస్‌కి చెందిన కీలక నేతకే దక్కాలనే చర్చ జరగడంతో ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. చివరికి ఆయన పేరునే ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
కన్వీనర్ పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని, అది కూడా కాంగ్రెస్ నేతకే అప్పగించాలని బిహార్ సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన ఇండియా కూటమి నేతలు.. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలను చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగాయి. ఇదే సమయంలో కన్వీనర్‌గా ఎవర్ని నియమించాలనే అంశంపై కూడా తీవ్రమైన చర్చ జరిగినట్టు సమాచారం. నితీశ్ కుమార్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు.
దీంతో ప్రస్తుతానికి ఖర్గేను ఛైర్మన్‌గా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై కూటమి నుంచి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపిన తరువాత అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని సమాచారం. గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిపైనా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదనలు చేశారు. మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని సూచించారు.
అయితే, ఈ విషయంలో కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రతిపాదనపై నితీశ్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. అది కేవలం ప్రపోజల్ మాత్రమే అని బుజ్జగించారు. ఈ విషయంలోనే కాదు. సీట్ల పంపకాల్లోనూ విభేదాలు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సర్దుబాటుకు రాష్ట్ర కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ గుర్రుగా ఉంది. ఆప్‌తో కాంగ్రెస్ చర్చలు కూడా వివాదాస్పదంగా ఉంది. ఢిల్లీలో 4 సీట్లు, పంజాబ్‌లో ఏడు సీట్లు కావాలని ఆ పార్టీ కోరుతుండగా.. ఆప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఢిల్లీ, పంజాబ్ రెండింటిలోనూ అధికార పార్టీ ఎక్కువ సీట్లను కోరుతోంది. గోవా, హరియాణా, గుజరాత్‌లలో కూడా ఆప్ పోటీ చేయాలనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.