యూపీలోని లక్నో హసన్‌గంజ్ ప్రాంతంలో జనవరి 7వ తేదీన దారుణం జరిగింది. భార్య సుమన్‌తో బ్రిజ్ మోహన్‌కు గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బ్రిజ్ మోహన్ దాడి చేశాడు.
భార్యను కత్తితో 19 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలోని బ్యూటీ పార్లర్ సమీపంలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాధితురాలు చికిత్స పొందుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.