ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సందడి మొదలైంది. తొలిరోజు ఆదివారం భోగి సందర్భంగా తెల్లవారుజాము నుంచే పల్లెలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తున్నారు. భోగి మంటల్లో పాత సామగ్రిని వేసి పిల్లలు, పెద్దలు సందడి చేస్తున్నారు.
తమ కష్టాలను తొలగించాలని ఆ అగ్ని దేవుడిని కోరుకుంటున్నారు. ఇక మహిళలు ఇంటి ముందు అందంగా ముగ్గులు వేస్తూ సంబురాలు జరుపుకొంటున్నారు.