ప్రేమలో విఫలం అయ్యామని, పరీక్ష తప్పామని, ఇంట్లో వాళ్లు తిట్టారని ఇలా క్షణికావేశంలో టీనేజర్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎగ్జామ్ ఫోబియా కారణంగా ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సైకాలజిస్టులు తెలిపారు.
ఆశించిన ఫలితాలు రాకపోతే కెరీర్‌లో ఎదగలేమోనని వారికీ వారే ఊహించుకుంటూ మనస్తాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకండి. మానసికంగా వారికి ధైర్యం చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.