నేడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో నయ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి బయలుదేరి ముంబై చేరుకుంటుంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ 6000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు.
ఈ యాత్ర రెండు నెలల పాటు సాగుతుంది. రాహుల్ గాంధీ 60 నుంచి 70 మందితో కాలినడకన, బస్సులో ప్రయాణించనున్నారు. మణిపూర్‌లోని ఖోంగ్జోమ్ వార్ మెమోరియల్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది.