అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి పండుగ వేడకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతే రాజు అనే ఈ నేలపైన రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని ఆరోపించారు. అధికార ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిపోయిందని పవన్ ఆరోపించారు.