పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు వచ్చి చేరడంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.
దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ శనివారం వెల్లడించారు. దీనిపై త్వరలోనే కెనడా కేంద్ర సర్కార్ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించనున్నట్లు మిల్లర్ పేర్కొన్నారు.