బొమ్మనహాల్ ఎంపీపీ పద్మ తమకొద్దంటూ వైసీపీ ఎంపీటీసీలు తిరుగుబాటు చేశారు. ముల్లంగి నాగమణి ఇంట్లో 12 మంది వైసీపీ ఎంపీటీసీలు రహస్యంగా సమావేశమయ్యారు.
తక్షణమే ఎంపీపీ పదవికి పద్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఎంపీపీకి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు 12 మంది ఎంపీటీసీలు వెల్లడించారు.