కొవిడ్-19 తరహాలో మరో డేంజరస్ వైరస్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. థాయిలాండ్ గుహల్లోని గబ్బిలాల్లో కొత్త వైరస్ ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అమెరికా కేంద్రంగా పని చేసే 'ఎకోహెల్త్ అలయన్స్' సంస్థ శాస్త్రవేత్త పీటర్ దస్జాక్ ఈ విషయాన్ని తాజాగా తెలిపారు.
అక్కడి రైతులు గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది కొవిడ్-19 తరహాలో మనుషులకు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు.