ఒడిశాలో ఉరి వేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కొరాపుట్ జిల్లాలోని జోడీ పాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతులు జోడీ పాయి గ్రామానికి చెందిన మహేంద్ర హికొ కా(21), జుబంతి ముస్క(18) గా గుర్తించారు. కులాంతర వివాహానికి రెండు కుటుంబాలు నిరాకరించడంతో మనస్తాపం చెంది ప్రేమజంట ఉరేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.