తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి ‘సంబరాల రాంబాబు.. అంబటి రాంబాబు’ అనే ప్రత్యేక పాటకు స్టెప్పులు వేశారు. కాగా గత ఏడాది మంత్రి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.