తమిళనాడులోని పుద్దుక్కోట్టై సమీపంలోని 'తిరుమయం క్షేత్రం' 108 దివ్య తిరుపతులలో ఒకటిగా దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారు సత్యగిరినాథుడిగా పూజలందుకుంటున్నాడు. స్థలపురాణం ప్రకారం పూర్వం ఓ రాత్రి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి, స్వామివారి విగ్రహాన్ని దొంగలించేందుకు యత్నించారట.
ఒక్కసారిగా ఆదిశేషువు నిజరూపం ధరించి, ఆ దొంగలపై విషాన్ని వెదజల్లాడట. నాటి నుంచి స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువయ్యాడని భక్తుల విశ్వాసం.