పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం. మద్యం మత్తులో భార్య నాగమణి బతికుండగానే భర్త జేమ్స్ ఉరివేశాడు. పిల్లలు విషయమై తలెత్తిన వివాదంలో భార్య చెంపపై భర్త కొట్టాడు. దీంతో నాగమణి స్పృహ కోల్పోయింది.
భార్య చనిపోయిందనుకొని.. ఆమెను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యానుకు ఉరేశాడు. కొన ఊపిరితో ఆమె వేలాడుతుండటం చూసి.. మళ్లీ కిందకు దించి బతికించే యత్నం చేశాడు. కానీ ఆమె మరణించింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.